న్యాయ విద్య చదవాలనుకునే వారికి గుడ్ న్యూస్. ఈరోజు TSLAWCET 2024 నోటిఫికేషన్ విడుదలైంది. లా డిగ్రీ, పీజీ చేయాలనుకునే వారు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే రాష్ట్రంలోని లా కాలేజీల్లో అడ్మిషన్ పొందవచ్చు. మార్చి 1 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. అభ్యర్థుల నుంచి ఏప్రిల్ 15 వరకు లాసెట్, పీజీఎల్ సెట్‌కు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుముతో మే 25 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. మే 30 నుంచి హాల్‌టికెట్లు ఇస్తారు.
జూన్ 6న టీఎస్ లాసెట్, టీఎస్ పీజీఎల్‌సెట్ ప్రవేశ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు లాసెట్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పీజీఎల్‌సెట్ ఎగ్జామ్స్ ఉంటాయి. అప్లికేషన్ ఫీజు జనరల్ అభ్యర్థులకు రూ.900, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.600 చెల్లించాలి. లేట్ ఫీజుతో మే 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులో ఏవైనా తప్పులు ఉంటే మే 20 నుంచి 25 మధ్యలో ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు.
పరీక్ష కేంద్రాలు
హైద్రాబాద్, నల్లగొండ, కోదాడ, ఖమ్మం, కరీంనగర్, సిద్ధిపేట, భద్రాద్రి కొత్తగూడెం, సత్తుపల్లి, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, నర్సంపేట, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, విశాఖపట్నం, కర్నూలు, తిరుపతి, విజయవాడ