పప్పు యాదవ్‎ను చంపేస్తాం: ఎంపీకి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్

పప్పు యాదవ్‎ను చంపేస్తాం: ఎంపీకి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‎ను చంపేస్తామంటూ బెదిరింపులకు దిగి ప్రపంచానికి పరిచయమైన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.. ఇటీవల మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీని హత్య చేసే దేశంలో హాట్ టాపిక్‎గా మారింది.  బాబా సిద్ధిఖీ మర్డర్‎తో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిపోయింది. ఇదిలా ఉండగానే.. మరో పొలిటికల్ బిగ్ షాట్‎కు చంపేస్తామంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. 

బీహార్‎లో కీలక రాజకీయ నేత, పూర్నియా పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ పప్పు యాదవ్‎ను చంపేస్తామని బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరించింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. చంపేస్తామని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి తనకు బెదిరింపు కాల్ వచ్చిందని తెలిపారు. చాలా  సార్లు ఇలాగే బిష్ణోయ్ గ్యాంగ్ నుండి తనకు థ్రెట్ కాల్స్ వచ్చాయని పప్పు పేర్కొన్నారు. అయితే, పప్పు యాదవ్‎ను బిష్ణోయ్ గ్యాంగ్ లేపేస్తామని బెదిరించడానికి అసలు కారణం వేరే ఉంది.

పప్పు యాదవ్‎ను బెదిరించడానికి కారణం ఏంటంటే..?

ఎన్సీపీ లీడర్, సల్మాన్ ఖాన్ మిత్రుడు బాబా సిద్ధికీ మర్డర్ మహారాష్ట్రను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాబా సిద్ధిఖీ మర్డర్‎పై సోషల్ మీడియా వేదికగా పప్పు యాదవ్ రియాక్ట్ అయ్యారు. ఈ పోస్ట్‎లో.. చట్టం అనుమతి ఇస్తే బిష్ణోయ్ గ్యాంగ్‎ను 24 గంటల్లో ఖతం చేస్తానని పప్పు యాదవ్ వార్నింగ్ ఇచ్చారు. "జైలులో కూర్చున్న ఓ నేరస్థుడు సవాల్ విసురుతున్నాడు. మనుషులను చంపేస్తున్నాడు. అతడి ముందు అందరూ మూగ ప్రేక్షకులే. ముందుగా మూసేవాలా, తర్వాత కర్ణి సేన అధినేత.. ఇప్పుడు బాబా సిద్ధిఖీని చంపేశారు. 

ALSO READ | చట్టంలో మార్పులు చేస్తున్నాం..ఫేక్ కాల్ చేస్తే ఇక అంతే: మంత్రి రామ్మోహన్ నాయుడు

చట్టం అనుమతిస్తే 24 గంటల్లో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ను అంతం చేస్తాను’’  అని పప్పు యాదవ్ ఎక్స్‎లో ట్వీట్ చేశారు.దీంతో తమ గ్యాంగ్‎కు దమ్మీ ఇచ్చిన పప్పు యాదవ్‎ను బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్ చేసింది. ఈ క్రమంలోనే చంపేస్తామని పలుమార్లు పప్పు యాదవ్‎కు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చింది. బిష్ణోయ్ గ్యాంగ్ నుండి థ్రెట్ కాల్స్ ఎక్కువ కావడంతో పప్పు యాదవ్ పోలీసులను ఆశ్రయించాడు. 

ఈ విషయాన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి.. బిష్ణోయ్ గ్యాంగ్‎తో తన ప్రాణానికి ముప్పు పొంచి ఉందని.. భద్రతను పెంచాలని పప్పు యాదవ్ విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు కేంద్ర హోంశాఖకు లేఖ రాశాడు. తనకు జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని కోరుతూ.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి వచ్చిన బెదిరింపు సందేశాలను కేంద్రానికి పంపాడు. దీనిని పరిగణలోకి తీసుకుని భద్రతను పెంచాలని రిక్వెస్ట్ చేశాడు.