
సినీ ఇండస్ట్రీలో ఫేక్ న్యూస్ రావడం సర్వ సాధారణం. ఎక్కడ లీడ్ దొరుకుతుందో కానీ ఆ పాయింట్ పట్టుకుని కథలు అల్లేస్తుంటారు కొందరు. తర్వాత వాటి గురించి ఆ సినిమా యూనిట్ క్లారిటీ ఇచ్చుకోవాల్సి వస్తుంది. తాను నటిస్తున్న కొత్త మూవీ గురించి అలాంటి పుకార్లే రావడంతో రాఘవ లారెన్సు రాఘవ సోషల్ మీడియా ద్వారా చెక్ పెట్టాడు. రజినీకాంత్ నటించిన ‘చంద్రముఖి’ అప్పట్లో ఎంతటి ఘన విజయం సాధించిందో చెప్పనక్కర్లేదు. ఆ చిత్రానికి సీక్వెల్‌గా ‘చంద్రముఖి 2’ తెరకెక్కనున్నట్టు, దానిలో రజినీకాంత్ తో కలసి నటిస్తున్నట్లు ఇప్పటికే ఖరారు చేశాడు.. అయితే రజినీ హీరోగా చేస్తుంటే లారెన్సు రాఘవ వేరే రోల్ చేస్తున్నారా లేక ఇతను హీరోగా చేస్తుంటే ఆయన గెస్ట్‌గా కనిపించనున్నారా అనేది క్లారిటీ లేదు. అంతలోనే ఈ సీక్వెల్‌లో హీరోయిన్ గురించి గుసగుసలు మొదలయ్యాయి . సిమ్రాన్, జ్యోతిక, కియారా అద్వానీ అంటూ వరుసగా ఎవరో ఒకరి పేరు వార్తల్లోకొస్తూనే ఉంది. ఇవి ఆగేలా లేవనుకున్నాడో ఏమో.. లారెన్స్ క్లారి టీ ఇవ్వడానికి ముందుకొచ్చాడు. ఇప్పటి వరకు వచ్చినదంతా ఫేక్ న్యూసే అని, నమ్మొద్దని చెప్పాడు. ప్రస్తుతం స్క్రిప్టు వర్కు జరుగుతోందట. పరిస్థితులు చక్కబడ్డ తర్వాత హీరోయిన్ పేరు అఫీషియల్‌గా ప్రకటిస్తారట.. అప్పటి వరకు ఏవేవో ఊహించుకోకుండా కొంచెం వెయిట్ చేయమని చెప్పాడు.