ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవా లారెన్స్(Raghava Lawrence), ఎస్‌జే సూర్య(SJ Surya) ప్రధాన పాత్రల్లో వచ్చిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా మూవీ జిగర్ తాండ డబుల్ ఎక్స్(Jigarthanda Double X). తమిళ బ్లాక్ బస్టర్ మూవీ జిగర్ తండ(Jigarthanda) సినిమాకు ఇది సీక్వెల్ తెరకెక్కింది. తమిళంలో క్రియేటీవ్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న కార్తీక్ సుబ్బరాజు(Karthik Subbbaraju) ఈ సినిమాను తెరకెక్కించారు. టీజర్, ట్రైలర్ తో అంచనాలు పెంచిన ఈ సినిమా నేడు(నవంబర్ 10) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా షోస్ చాల చోట్ల ముగియడంతో.. సినిమా చుసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రయాన్ని పంచుకుంటున్నారు. మరి జిగర్ తాండ డబుల్ ఎక్స్ సినిమా ఎలా ఉంది? ఆడియన్స్ ఏమేరకు మెప్పించింది? అనేది ఈ రివ్యూలో చూద్దాం.
#JigarthandaDoubleX Review
— LetsOTT (@letesott) November 10, 2023
Good First Half and Very Good Second Half?
S.J.Surya and Lawrence Performance Ultimate?
Music?
Screenplay Brilliant ?
Last 40 Minutes and Climax Verithanam?
Worth watch.
My Rating 4.2/5⭐#Japan #Leo #Ayalaan #Salaar #CaptainMiller #TheMarvels pic.twitter.com/BrWGIkdTnT
జిగర్ తాండ డబుల్ ఎక్స్ సినిమాకు ఆడియన్స్ నుండి సూపర్ హిట్ టాక్ వస్తోంది. సినిమా ఫస్ట్ హాఫ్ సూపర్ గా ఉందని, సెకండ్ హాల్ఫ్ నెక్స్ట్ లెవల్లో ఉందని కామెంట్స్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా సినిమాలో చివరి 40 నిమిషాలు అల్టిమేట్ అంటున్నారు. ఇక రాఘవా లారెన్స్, ఎస్‌జే సూర్య తమ నటనతో సినిమాను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లారని, స్క్రీన్ బ్రిలియంట్ గా ఉందని, సంతోష్ నారాయణన్ సంగీతం సినిమాకు ప్రాణంగా మారిందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక మొత్తంగా జిగర్ తాండ డబుల్ ఎక్స్ పర్ఫెక్ట్ సీక్వెల్ అని, రెండు గంటలు ఆడియన్స్ ఫుల్లుగా ఎంటర్టైన్ అవ్వొచ్చు అని చెప్తున్నారు.
Also Read :- జపాన్ మూవీ రిజల్ట్ ఏంటి? ఆడియన్స్ ఏమంటున్నారు?