కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి హీరోగా నటించి దర్శకత్వం వహించిన 'కాంతర' బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో సీక్వెల్ కాంతర: చాప్టర్ 1 పై ఆసక్తి నెలకొంది. అయితే ఇటీవలే కాంతార చిత్ర యూనిట్ పై హేరురు గ్రామస్థులు పోలీసులుకి ఫిర్యాదు చేశారు.
పూర్తివివరాల్లోకి వెళితే ప్రస్తుతం కాంతర: చాప్టర్ 1 సినిమా షూటింగ్ ప్రస్తుతం గవిగుడ్డ అటవీ ప్రాంతంలో జరుగుతోంది. దీంతో కొన్ని రోజులుగా చిత్ర యూనిట్ అడవిలో టెంట్లు ఏర్పాటు చేసుకుని షూటింగ్ చేస్తున్నారు. అయితే ఈ షూటింగ్ కి చిత్ర యూనిట్ ప్రభుత్వం నుంచి ముందే పర్మిషన్స్ తీసుకున్నప్పటికీ సరిహద్దులు దాటి షూటింగ్ చేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నించినందుకుగానూ హరీష్ అనే వ్యక్తిపై చిత్ర యూనిట్ సభ్యులు దాడి చేశారు. దీంతో గ్రామస్థులు యెసలూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
Also Read : చరిత్ర సృష్టించిన వెంకీ మామ
కొన్ని యాక్షన్ సన్నివేశాలని తెరకెక్కించే క్రమంలో చెట్లు నరికివేస్తున్నారని, అలాగే పేలుఫు పదార్థాలు ఉపయోగించి పెద్ద మంటలు వెలిగిస్తున్నారని దీంతో ఈ ప్రభావం పర్యావరణం మీద పడటమేకాకుండా వన్య ప్రాణులు నివాసాలు కోల్పోతున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు.
దీంతో ఏనుగులు బెదిరి గ్రామాల్లోకి వచ్చి దాడి చేస్తుండటంతో రైతులు తీవ్ర నిబ్బందులు ఎదుర్కొంటున్నారని కాబట్టి వెంటనే షూటింగ్ నిలిపివేసి వేరే చోటకి మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే తమకి త్వరగతిన న్యాయం చేయకుంటే హైకోర్టుని ఆశ్రయిస్తామని చిత్ర యూనిట్ ని గ్రామస్థులు హెచ్చరిస్తున్నారు.