రూ.40 వేల లంచం డిమాండ్.. లాయర్, సీఐ ఇద్దరూ అరెస్ట్

రూ.40 వేల లంచం డిమాండ్.. లాయర్, సీఐ ఇద్దరూ అరెస్ట్

ఓ వ్యక్తి మీద రౌడ్ షీట్ ఓపెన్ చేయకుండా ఉండేందుకు  చంద్రశేఖర్ రెడ్డి అనే లాయర్ రూ.40 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు.  ఆ డబ్బును తన కోసం కాదని, జిల్లా సీఐ కోసమే తీసుకున్నామని వాంగ్మూలం ఇవ్వడంతో అతనితో సీఐ రామయ్యనాయుడ్ని కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

కర్నూల్ లో సోమవారం ఉదయం 9 గంటల సమయంలో లాయర్ చంద్రశేఖర్ రెడ్డి రూ.40 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులుకు చిక్కాడు. గోపాల్ రెడ్డి అనే వ్యక్తి మీద రౌడీ షీట్ ఓపెన్ చేయకుండా ఉండేందుకు ఈ లంచం తీసుకున్నట్టు సమాచారం. అధికారులు దీని గురించి లాయర్ ని ప్రశ్నించగా.. ఆ డబ్బును కర్నూల్ సీసీఎస్ సీఐ రామయ్య నాయుడి కోసం తీసుకున్నానని, సీఐ నేరుగా కాకుండా తన ద్వారా లంచం డిమాండ్ చేశాడని అధికారులతో చెప్పాడు.

విషయం తెలుసుకున్న కర్నూలు ఏసీబీ డి.ఎస్.పి నాగభూషణం… లాయర్ ని, సీఐ ని ఇద్దర్నీ అరెస్ట్ చేశారు. సీఐ రామయ్య నాయుడు మాత్రం తనకేమీ తెలియదని, ఆ లాయర్ లంచం తీసుకొని తన పేరు చెబుతున్నాడని మండి పడ్డాడు.

 Lawyer and CI arrested by ACB for bribe demand