- డీజీపీకి ఫిర్యాదు చేసిన న్యాయవాది రాజేశ్
బషీర్ బాగ్, వెలుగు: అఘోరి మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోందని న్యాయవాది రాజేశ్‌కుమార్ ఆరోపించారు. అఘోరిపై చర్యలు తీసుకోవాలంటూ శనివారం లక్డీకాపూల్‌లోని డీజీపీ ఆఫీసులో ఫిర్యాదు చేశారు.
అనంతరం రాజేశ్కుమార్మాట్లాడుతూ..ఆత్మాహుతి చేసుకుంటాననడం సనాతన ధర్మానికి విరుద్ధం అన్నారు. తనను తాను నియంత్రించుకోలేని అఘోరి సనాతన ధర్మాన్ని ఎలా కాపాడుతుందని ప్రశ్నించారు. అఘోరిని స్టేట్ హోంలో ఉంచి కౌన్సెలింగ్ ఇవ్వాలని కోరారు.