లా అండ్ ఆర్డర్‌ని కాపాడటంలో పోలీసులు, న్యాయస్థానాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. మరి న్యాయస్థానాలే అల్లర్లకు అడ్డాగా మారితే.. లాయర్లు, జడ్జ్ లమధ్య గొడవలు జరిగితే. బౌతిక దాడులకు దిగితే.. అవునూ.. ఇది అనుకోవడానికి విఛిత్రంగా ఉన్నా.. నిజంగా జరిగింది. గౌరవప్రదమైన న్యాయస్థానం అని కూడా మరిచిపోయి లాయర్లు, జడ్జి పోరుకు దిగారు. వీరిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీకి పని చెప్పారు. దీంతో 10 మంది లాయర్లు గాయపడ్డారు.
ఘజియాబాద్ జిల్లా సెషన్స్ కోర్టు దగ్గర అక్టోబర్ 29న ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ కేసు విషయంలో జడ్జ్ వైఖరిని తప్పుబడుతూ న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనకారులను చెదర గొట్టడానికి న్యాయవాదులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. 10 మంది న్యాయవాదులు గాయపడ్డారు. జిల్లా సెషన్స్ జడ్జి అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రాసిక్యూషన్ ప్రత్యేక విచారణ కోసం కేసును వాయిదా వేయాలని కోరుతూ ప్రాసిక్యూషన్ కోర్టును ఆశ్రయించాడు. తమ వంతు వచ్చే వరకు వేచి ఉండాలని న్యాయమూర్తి వారికి సూచించారు.
#Ghaziabad
— Akash Garg (@gargakash6957) October 29, 2024
कोर्ट में वकीलों और जज में हुई झड़प, पुलिस ने वकीलों को कोर्ट रूम से बाहर खदेड़ा, कोर्ट रूम के अंदर लाठियां चली, कुर्सियां फेंकी गईं। एक केस की सुनवाई के दौरान ये झड़प हुई थी pic.twitter.com/vsAiYeKrzr
లాయర్లు దానికి ఒప్పుకోలేదు. దీంతో అసంతృప్తి చెందిన న్యాయవాదులు కోర్టు ఆవరణలోనే అరుచుకుంటూ గోల చేశారు. పరిస్థితి అదుపు తప్పి జడ్జ్, న్యాయవాదులకు మధ్య గొడవకు దారితీసింది. దీంతో కోర్టు పరిసరాలు ఉద్రిక్తంగా మారాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు జస్టిస్ కుమార్ పోలీసులను పిలిచారు. లాఠీలతో పోలీసులు జోక్యం చేసుకుని గుంపును చెదరగొట్టారు. పలువురు లాయర్లు గాయపడ్డారు. తరువాత వారిని చికిత్స కోసం హాస్పిటల్ కు తరలించారు.