లాయర్​పై ఏఎస్ఐ దాడిపట్ల నిరసన

లాయర్​పై ఏఎస్ఐ దాడిపట్ల నిరసన

సిద్దిపేట, వెలుగు : సిద్దిపేట టూటౌన్ ఏఎస్ఐ ఉమారెడ్డి లాయర్​రవీందర్ పై దాడి చేయడాన్ని నిరసిస్తూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం కోర్టు ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్  నాయకుడు జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. లాయర్​రవీందర్ ఓ కేసు విషయంపై టూ టౌన్ పీఎస్​కు వెళ్తే  ఏఎస్ఐ ఉమారెడ్డి అసభ్యంగా మాట్లాడుతూ దాడి చేయడమే కాకుండా ఫోన్ పగలగట్టాడని చెప్పారు.

ఈ విషయంపై  టూటౌన్ లో ఫిర్యాదు చేయడానికి ప్రయత్నిస్తే సీఐ సరైన విధంగా స్పదించలేదన్నారు. లాయర్​పై దాడి చేసిన ఎఎస్ఐ పై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వన్ టౌన్ పీఎస్​లో ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. ఏఎస్ఐ చర్యలు తీసుకోకుంటే బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ నిరసన కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.