కొత్త చట్టాలను రద్దు చేయాలంటూ వరంగల్​లో లాయర్ల నిరసన

హనుమకొండ సిటీ, వెలుగు : భారత ప్రభుత్వం రూపొందించిన కొత్త చట్టాలను రద్దు చేయాలని వరంగల్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తీగల జీవన్ కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం హనుమకొండలోని వరంగల్ కోర్టు ఎదుట కొత్త చట్టాలకు వ్యతిరేకంగా అడ్వొకేట్లు నిరసన తెలిపారు.

ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాసేలా ఉన్న కొత్త చట్టాలను తక్షణమే నిలిపి వేయాలన్నారు. అడ్వొకేట్లు చిరంజీవి, శివశంకర్, రమేశ్​ పాల్గొన్నారు.