అసెంబ్లీ ముట్టడికి యత్నించిన అడ్వొకేట్లు

అసెంబ్లీ ముట్టడికి యత్నించిన అడ్వొకేట్లు

హైదరాబాద్ లోని అసెంబ్లీ ముట్టడికి యత్నించారు  అడ్వొకేట్లు. మార్చి 24న  సంతోష్ నగర్ లో అడ్వొకేట్ హత్యను నిరసిస్తూ అసెంబ్లీ ముట్టడికి యత్నించారు న్యాయవాదులు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్బంగా అడ్వొకేట్ల రక్షణ కోసం ప్రత్యేకంగా చట్టం తెచ్చి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఇటీవల అడ్వొకేట్ల హత్యల నేపథ్యంలో రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. 

హైదరాబాద్ చంపాపేట్ లో మార్చి 24న సంతోష్ నగర్ న్యూ మారూతీ నగర్ లో అడ్వకేట్  ఏర్రబాపు ఈశ్రాయిల్ ను  దస్తగిరి అనే ఎలక్ట్రిషియన్ కత్తితో పొడిచి చంపాడు.  చంపాపేట్ సంతోష్ నగర్ న్యూ మారుతి నగర్ కాలనీ లో  ఏర్రబాపు ఇజ్రాయిల్ అడ్వొకేట్  ఉంటున్నాడు. అదే  ప్లాట్ లో  పైన ఉంటున్న ఓ మహిళను   ఎలక్ట్రిషియన్ దస్తగిరి వేధిస్తున్నాడు. ఈ వేధింపులు భరించలేక ఇటీవల అడ్వొకేట్  ఎర్రబాపు ఇజ్రాయిల్  ను ఆశ్రయించింది బాధిత మహిళ .  అయితే మహిళతో కలిసి పీఎస్ లో దస్తగిరిపై ఫిర్యాదు చేశాడు అడ్వొకేట్  ఎర్రబాపు ఇజ్రాయిల్. 

Also Read:-నేను మిమ్మల్ని అనలేదు.. సునీత వ్యాఖ్యలకు స్పీకర్ వివరణ..

దీంతో కక్ష పెంచుకున్న ఎలక్ట్రిషియన్ దస్తగిరి తనపైనే కంప్లైంట్ చేస్తావా అంటూ అడ్వొకేట్ పై  కత్తితో దాడి చేశాడు . వెంటనే కుటుంబ సభ్యులు  అపోలో ఆసుపత్రికి తరలించారు.  చికిత్స పొందుతూ అడ్వొకేట్  ఎర్రబాపు ఇజ్రాయిల్ మార్చి 24న   మృతి చెందాడు.  హత్య అనంతరం ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ లో నిందితుడు దస్తగిరి లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.