ఖమ్మంలో ఘనంగా లక్ష్మణ్ బాపూజీ జయంతి

ఖమ్మం టౌన్ , భద్రాచలం వెలుగు :  మాజీ మంత్రి, స్వాతంత్ర్య సమర యోధుడు దివంగత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 108వ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఘన నివాళి అర్పించారు. బుధవారం ఖమ్మం నగరంలోని లకారం ట్యాంక్ బండ్ పై కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ఎంపీ  నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఎమ్మెల్యేలు బానోత్ హరిప్రియ నాయక్, రాముల్ నాయక్ అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, నాయకులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. బాపూజీ తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమంలో పోరాడి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు.