రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా పెరిగింది: లక్ష్మణ్

రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా పెరిగింది: లక్ష్మణ్

రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా పెరిగిపోయిందన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్. ప్రశ్నించిన వారిపై ఎదురుదాడి చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్ ఏరులైపారుతుందని ప్రతీ ఊర్లో బెల్ట్ షాపులు తెరిచారని అన్నారు. ఎన్నికల వేల చేసిన హామీలన్నీ కేసీఆర్ మరిచారని అన్నారు. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయినా టీఆర్ఎస్ కు కనువిప్పు కలుగలేదని చెప్పారు.

బీసీలకు ఆరు శాతం మాత్రమే జడ్పీ స్థానాలను కెటాయించారని అన్నారు లక్ష్మణ్. 34శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లను 23శాతానికి ఎలా తగ్గించారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.  బీసీలు ఈ విషయం పై ఆలోచించాలని తెలిపారు. రాజకీయ దురుద్ధేశంతోనే ప్రత్యక్ష ఎన్నికలకు కాకుండా పరోక్ష ఎన్నికలకు వెళ్తున్నారని చెప్పారు. తుగ్లక్ లా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని అన్నారు లక్ష్మణ్.