జైనూర్‌‌లో లక్ష్మణ్ మెమోరియల్ టోర్నీ షురూ

జైనూర్‌‌లో లక్ష్మణ్ మెమోరియల్ టోర్నీ షురూ

జైనూర్, వెలుగు: జైనూర్ మేజర్ గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ మెస్రం లక్ష్మణ్ స్మారక జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను మార్కెట్ కమిటీ చైర్మన్ విశ్వనాథ్, లక్ష్మణ్ సతీమణి పార్వతిబాయి ఆదివారం ప్రారంభించారు. జైనూర్ సహకార సొసైటీ చైర్మన్ కొడప హన్ను పటేల్, జిల్లా గ్రంథాలయ శాఖ మాజీ చైర్మన్ కనక యాదవ్ రావు, మాజీ సర్పంచ్ మడావి భీంరావు, మాజీ ఎంపీటీసీ కుమ్ర భాగవంత్ రావు, పలు పార్టీల నేతలుహాజరై  పూజలు చేసి లక్ష్మణ్ ఫొటోకు నివాళులు అర్పించారు. 

మండలంలోని అన్ని వర్గాల అభివృద్ధికి సర్పంచ్​గా లక్ష్మణ్ ఎంతో సేవ చేశారని కొనియాడారు. మండల యువజన సంఘాలు ఆయన పేరిట టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమన్నారు.