భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కెరీర్ ప్రస్తుతం ఓ రేంజ్ లో ఉంది. ముఖ్యంగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ అశ్విన్ కెరీర్ లో మర్చిపోలేనిది. రాజ్ కోట్ టెస్టులో 500 వికెట్ల ఘనత పూర్తి చేసుకొని చరిత్ర సృష్టించాడు. ఇక రాంచీ టెస్టులో 351 వికెట్లతో స్వదేశంలో అత్యధిక వికెట్లు తీసుకున్న ఆటగాడిగా రికార్డ్ నెలకొల్పాడు. ధర్మశాల వేదికగా జరగనున్న ఐదో టెస్ట్ అశ్విన్ టెస్ట్ కెరీర్ లో 100 వది. ఈ టెస్టు మ్యాచ్ నుచిరస్మరణీయంగా మలచుకుందామనుకున్న అశ్విన్ కు భారత మాజీ క్రికెటర్ శివరామకృష్ణన్ నుంచి చేదు అనుభవం ఎదురైంది.
100వ టెస్ట్ సందర్భంగా అశ్విన్‌కి లక్ష్మణ్ శివరామకృష్ణన్ శుభాకాంక్షలు తెలిపేందుకు కాల్ చేశానని..అయితే తన ఫోన్‌ను తీయలేదని, మెసేజ్ కు సమాధానం ఇవ్వలేదని శివరామకృష్ణన్ సోషల్ మీడియాలో వెల్లడించారు. మాజీ క్రికెటర్ గా మాకు లభించే గౌరవం ఇదే అని చెప్పుకొచ్చాడు. శివరామకృష్ణన్ గతంలో అశ్విన్‌పై విమర్శలు చేశాడు. అనేక సందర్భాల్లో అశ్విన్ బౌలింగ్‌కు వ్యతిరేకంగా బహిరంగంగానే తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ALSO READ :- KS Ravikumar:సెట్లో ఎవరు నవ్వినా బాలకృష్ణ తట్టుకోలేడు..డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
అశ్విన్ పై శివరామకృష్ణన్ విమర్శలు చేయడం ఫ్యాన్స్ కు నచ్చలేదు. దీంతో అభిమానులు ఈ మాజీ క్రికెటర్ ను ట్రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ లో అశ్విన్ 4 టెస్టుల్లో17 వికెట్లు పడగొట్టాడు. హర్టీలి, బుమ్రా తర్వాత ఈ సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్ గా కొనసాగుతున్నాడు. 5 టెస్టుల సిరీస్ లో చివరిదైన ఐదో టెస్ట్ రేపు (మార్చి 7) ధర్మశాల వేదికగా జరుగుతుంది. ఈ సిరీస్ లో ఇప్పటికే భారత్ 3-1 తేడాతో సిరీస్ గెలిచిన సంగతి తెలిసిందే.
Former Indian spinner Laxman Sivaramakrishnan has alleged that Ravichandran Ashwin didn’t respond to his calls and ignored his messages ahead of the latter’s 100th Test. #sportspad #laxmansivarmakrishnan #ravichandranashwin #TestMatch2024 pic.twitter.com/b2cavM3Sx0
— sportspad (@sportspad_) March 6, 2024