![బాలయ్య కళ్లు తెరవాలి: లక్ష్మీపార్వతి](https://static.v6velugu.com/uploads/2021/11/laxmi-parvathi-comments-on-ntr-family-members_VODGCvZsUL.jpg)
అస్కార్ అవార్డును మించి చంద్రబాబు నటిస్తున్నారని మండిపడ్డారు...ఏపీ తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతి. NTR ను మోసం చేసినట్టే.. ఇప్పుడు ఆయన వారసులను చంద్రబాబు మోసం చేస్తున్నాడన్నారు. అసెంబ్లీలో ఏమీ జరగకున్నా.. కన్నీళ్లు పెట్టుకుని పెద్ద సీన్ క్రియేట్ చేశారని ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు మద్దతు ఇస్తున్నారని MLA బాలకృష్ణను ఉద్దేశించి మాట్లాడారు. ఇప్పటికైనా కళ్లు తెరవాలని, బాబు మాటలు నమ్మవద్దన్నారు. చంద్రబాబు సానుభూతి కోసం భార్య పేరు వాడుకున్నాడని విమర్శించారు.
ఎన్టీఆర్ ఫ్యామిలీ చంద్రబాబు మాయలో మరోసారి పడొద్దని కోరుతున్నా.. మిమ్మల్ని అబద్దాల వలయంలో చుట్టేశారు. లోకేష్‌ను సీఎం చేయాలన్నదే చంద్రబాబు టార్గెట్‌ని లక్ష్మీ పార్వతి చెప్పారు. ‘మీ నాన్నగారికి జరిగిన అన్యాయంపై మీకు బాధలేదా.?’.. ‘చెప్పులు వేయించిన ఘటన మర్చిపోయారా.?’ భువనేశ్వరిని అంటే తనకు బాధ కలుగుతుందని.. కానీ వైసీపీ నాయకులు అనలేదని చెప్పినా ఎందుకు పట్టించుకోరని లక్ష్మీ పార్వతి అన్నారు. భువనేశ్వరి తనకు బిడ్డలాంటిదన్నారు. భువనేశ్వరిని ఏమైనా అంటే.. తానే వైసీపీ నేతల్ని ప్రశ్నిస్తానని లక్ష్మీ పార్వతి అన్నారు.