ఐటీలో లేఆఫ్స్ సునామీ ..2 లక్షల 26 వేల మందిని తీసేశారు..

ఐటీలో లేఆఫ్స్ సునామీ ..2 లక్షల 26 వేల మందిని తీసేశారు..

2023లో టెక్ పరిశ్రమ ఉద్యోగుల తొలగింపులలో గణనీయమైన పెరుగుదలను చూసింది. దాదాపు 2లక్షల 26వేల మంది ఉద్యోగులను తొలగించాయి. గతేడాదితో పోలిస్తే ఉద్యోగుల తొలగింపులో దాదాపు 40 శాతం పెరుగుదలను సూచిస్తుంది. ఇది టెక్ రంగంలో తిరోగమన కాలాన్ని చూపిస్తుంది. 2022లో 2 లక్షల 2వేల మంది ఉద్యోగులను టెక్ కంపెనీలు తొలగించాయి. 

టెక్ పరిశ్రలో తొలగింపు ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. దీని ఫలితంగా అనేక కంపెనీలు మూతపడ్డాయి. 2023ని టెక్ పరిశ్రమలో చీకటి సంవత్సరంగా నిపుణులు పేర్కొంటున్నారు. 2022 జనవరి నుంచి డిసెంబరు వరకు టెక్ పరిశ్రమ తొలగింపులలో అన్యూహ్య పెరుగుదలను చూసింది. 1లక్షా 64వేల 744 మంది ఉద్యోగులు విడిచిపెట్టారు. ఈ సంఖ్య గతేడాది 15వేల కంటే దాదాపు పదకొండు రెట్లు ఎక్కువ.  దాదాపు 75,912 మంది వ్యక్తులు జనవరిలోనే ఉద్యోగాలు కోల్పోయారు. 2022లో నివేదించబడిన మొత్తం తొలగింపులలో దాదాపు సగం మంది ఉన్నారు.

రిటైల్, క్రిప్టోకరెన్సీ,రవాణా వంటి చిన్న టెక్ కంపెనీలపై ఉద్యోగుల తొలగింపు ప్రభావం ఎక్కువగా ఉంది. ఖర్చులు తగ్గించుకునేందుకు ఈ కంపెనీలు టెక్ పరిశ్రమలో ఎన్నడూ లేనంతగా  తొలగింపులు ప్రకటించాయి. గత మూడేళ్లలో టెక్ కంపెనీలు దాదాపు 4లక్షల 5వేల మంది ఉద్యోగులతో తెగతెంపులు చేసుకున్నాయి. 

అప్పటినుంచి అదనంగా మరో 24 వేల మందికి పింక్ స్లిప్ లు ఇచ్చారు. తాజా నివేదిక ప్రకారం మొత్తం తొలగింపుల సంఖ్య 2లక్షల 26వేల117కి చేరుకుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి, ద్రవ్యోల్బణం, రాబడి వృద్ధిలో క్షీణత, ట్రేడింగ్ వంటి అనేక అంశాలు ఉద్యోగాల కోత తీవ్రతరం కావడానికి ప్రధానం కారణం అయ్యాయని టెక్ కంపెనీలు అంటున్నాయి. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి ప్రముఖ పరిశ్రమ దిగ్గజాలు ఈ తొలగింపుల వేవ్‌లో ముందంజలో ఉన్నాయి.