
బ్యాంకింగ్ రంగంలో లేఆఫ్‌లు పెరుగుతున్నాయి. లేటెస్ట్ టెక్నాలజీ, ఆటోమేషన్, ఖర్చులు తగ్గించడం, ఆర్థిక అనిశ్చితి వంటి కారణాలతో కొన్ని బ్యాంకులు వేలాది ఉద్యోగులను తొలగిస్తున్నాయి. భారతదేశంలో కూడా బ్యాంకింగ్ రంగంలో లేఆఫ్‌లు పెరుగుతున్నాయి. తాజాగా ప్రముఖ లీడింగ్ బ్యాంక్ యాక్సిస్ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. వివిధ సెక్టార్లలో అధిక పెట్టుబడులు పెడుతున్న యాక్సిస్ బ్యాంకు.. ఉద్యోగుల మెరుగైన వ్యక్తిగత పనితీరును ఆశిస్తోంది. ఇందులో భాగంగా పనితీరు బాగాలేని ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వెల్లడించింది.
యాక్సిస్ బ్యాంకు వార్షిక అంచనా ప్రక్రియలో భాగంగా ఉద్యోగుల తొలగింపులు సాధారణమే అని తెలిపింది. ఇది బ్యాంకు సేవలలో ఎటువంటి మార్పు ఉండదని, దాదాపు 100కు పైగా సీనియర్ ఉద్యోగులను తొలగిస్తున్నామని, అయితే ఉద్యోగులకు ప్రమోషన్లు కూడా ఉంటాయని తెలిపింది.బ్యాంకింగ్ ఇండస్ట్రీ వివిధ రంగాల్లో అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. కొన్ని అభివృద్ది చెందుతాయి..మరికొన్ని ఒత్తిడిలో ఉంటాయి. యాక్సిస్ బ్యాంకు కొన్ని రంగాలలో భారీగా పెట్టుబడులు పెడుతోంది.. ఉద్యోగుల వ్యక్తిగత పనితీరును బట్టి తొలగింపులు కొన్నిసార్లు అనివార్యమని యాక్సిస్ బ్యాంక్ ప్రతినిధులు చెబుతున్నారు.