
హైదరాబాద్ కోఠి ఉమెన్స్ కాలేజీకి వందేళ్ల చరిత్ర ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ వర్శిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టడం గొప్ప కీర్తి అని అన్నారు. చాకలి ఐలమ్మ మహిళా వర్శిటీలో పలు నూతన భవనాలకు మార్చి 8న శంకుస్థాపన చేశారు రేవంత్ . ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. వర్శిటీ అభివృద్ధి పనులకు రూ. 500 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. ఈ యూనివర్శిటీ అంతర్జాతీయ యూనివర్శిటీలతో పోటీ పడాలన్నారు. ఇక్కడ చదివిన ప్రతి ఆడబిడ్డ ప్రపంచ స్థాయిలో రాణించాలన్నారు. రెండున్నరేళ్లలో వర్శిటీ నిర్మాణం పూర్తవుతుందన్నారు. వర్శిటీ నిర్మాణానికి నిధుల ఢోకా ఉండదన్నారు రేవంత్ .
ALSO READ | అఖిల పక్షానికి కమలం, కారు దూరం.. హాట్ టాపిక్‌గా రెండు పార్టీల తీరు
అవకాశం ఇస్తే అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తారని అన్నారు రేవంత్. రాజీవ్ గాంధీ మహిళా రిజర్వేషన్లు తీసుకొచ్చారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు సీఎం రేవంత్. మహిళలకు ఏ పాత్ర ఇచ్చినా సమర్థవంతంగా నిర్వహిస్తారని చెప్పారు. దేశం అభివృద్ధి చెందాలంటే మహిళల భాగస్వామ్యం పెరగాలన్నారు. తాము అధికారంలోకి వచ్చాక మహిళలకు బస్సుల్లో ఫ్రీ జర్నీ అవకాశం కల్పించామన్నారు. అదానీ అంబానీలతో పోటీపడేలా మహిళలను ప్రోత్సహిస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి.