ఛాయ్ కప్పులపై ఫొటో, గుర్తుతో కాంగ్రెస్ ప్రచారం

ఎల్బీనగర్, వెలుగు: త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ రానుండటంతో నేతలు ప్రచార జోరు పెంచారు. ఎవరికివారే సొంత సెగ్మెంట్లలో ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. గోడ పోస్టర్లు వేయించడం, ఫ్లెక్సీలు పెట్టించడంతో పాటు ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. 

ALSO READ : ఓటరు లిస్టులో అవకతవకలు.. సవరణ చేయాలి:మర్రి శశిధర్రెడ్డి

ఏ చిన్న అవకాశం దొరికినా సద్వినియోగం చేసుకుంటున్నారు. రోజుకో వ్యూహంతో ప్రచార పంథాను మార్చుతున్నారు. అందులో భాగంగానే ఎల్బీనగర్ లో కాంగ్రెస్ లీడర్ చాయ్ గ్లాసులను కూడా ప్రచారానికి వాడుతున్నారు. పేపర్ కప్పులపై ఆయన ఫొటో, గుర్తు వేయించుకుని ప్రచారం చేసుకుంటున్నారు. హస్తం గుర్తుకు ఓటేద్దాం అవినీతి లేని ఎల్బీనగర్ కు బాటేద్దాం అంటూ కొటేషన్లు రాయించుకుని ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.