మళ్లీ బీఆర్ఎస్లో చేరిన రామ్మోహన్ గౌడ్

ఎల్బీ నగర్ లో  రామ్మోహన్ గౌడ్ దంపతులు మళ్లీ సొంతగూటికి చేరారు.  కాంగ్రెస్ నుంచి ఎల్బీ నగర్ టికెట్ దక్కకపోవంతో బీఆర్ఎస్ లో చేరారు. మంత్రి హరీశ్ రావు వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రామ్మోహన్ దంపతులు మళ్లీ బీఆర్ఎస్ లో చేరడం ఆనందంగా ఉందన్నారు హరీశ్ రావు.

రామ్మోన్ గౌడ్  ఎల్బీ నగర్ టికెట్ రాలేదని అక్టోబర్ 12న  బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. సుధీర్ రెడ్డికి బీఆర్ఎస్ మళ్లీ టికెట్ ఇచ్చింది. దీంతో బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. అయితే కాంగ్రెస్ సెకండ్ లిస్టులో ఎల్బీ నగర్ సీటు మధుయాష్కి గౌడ్ కు కేటాయించింది. దీంతో అసంతృప్తితో ఉన్న రామ్మోహన్ గౌడ్ ఇవాళ హరీశ్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.  రామ్మోహన్ గౌడ్  బీఆర్ఎస్ లో చేరేటప్పుడు హరీశ్ ముందే  కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తును నినాదాలు చేశారు. జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు . నినాదాల మధ్యే హరీశ్ బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.