మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నెరస్థుడికి కోర్టు 20 యేండ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించిది. 2017లో రంగారెడ్డి జిల్లా మంచాల మండలం దాతపల్లి గ్రామానికి చెందిన సపావత్ అంజిత్ కుమార్(28).. అదే గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై మంచాల పోలీసులు పొక్సో చట్టం కింద కేసు నమోదుచేసి దర్యాప్తు జరిపి.. ఆరేళ్ల తర్వాత సరైన సాక్ష్యాధారాలను ఎల్బీనగర్ లోని పొక్సో స్పెషల్ కోర్టుకు సమర్పించారు.
విచారణ జరిపిన కోర్టు.. ఈ ఘటనలో నిందితుడిని నెరస్థుడిగా పరిగణిస్తూ.. 20 సంవత్సరాల జైలు శిక్షను విధించింది. ఈ కేసులో నెరస్థుడికి శిక్షపడేలా చేసిన మంచాల సిఐ, ఎస్సై, కానిస్టేబుల్ లను రాచకొండ సీపీ డీఎస్ చౌహన్ అభినందించినట్లు ఇబ్రహీంపట్నం ఏసీపి ఏఎస్ రావు మీడియా సమావేశంలో తెలిపారు.