సెప్టెంబర్​లో ఎల్‌‌డీఎఫ్ ఇండియా ఎక్స్​పో

సెప్టెంబర్​లో ఎల్‌‌డీఎఫ్ ఇండియా ఎక్స్​పో

హైదరాబాద్, వెలుగు:  లైవ్‌‌స్టాక్ (పశు సంపద), డెయిరీ (పాడి పరిశ్రమ),   ఫిషరీస్(మత్స్య సంపద) ట్రేడ్ ఎక్స్‌‌పోజిషన్​ ఈ ఏడాది సెప్టెంబరులో జరగనుంది. ఈ కార్యక్రమంలోనే నాలెడ్జ్​ కాన్​క్లేవ్​ కూడా ఉంటుంది.  హైదరాబాద్​లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేషనల్ ఫిషరీస్ డెవలప్‌‌మెంట్ బోర్డ్  మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సువర్ణ మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు ఈ రంగాల్లో చాలా మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. 

పశుసంపదలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని, గుడ్ల ఉత్పత్తి భారీగా జరుగుతున్నదని అన్నారు. చేపల పెంపకంలో తెలుగు రాష్ట్రాలు అద్భుత విజయాలు సాధించాయని చెప్పారు. అందుకే ఈ ఈవెంట్‌‌ను నిర్వహించడానికి హైదరాబాద్‌‌ను ఎంచుకున్నామని ఆమె తెలిపారు. మూడు రోజుల బిజినెస్ -టు -బిజినెస్ ఈవెంట్‌‌లో భారతదేశం అంతటి నుంచి100 మంది ఎగ్జిబిటర్లు పాల్గొంటారు.  దీనిని హైటెక్స్,  ఆక్వా ఫార్మింగ్ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.