- అన్యాయం చేశారని నల్గొండ జిల్లా నేతల అసహనం
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీలో మరో సారి వర్గపోరు బయటపడింది. మండల కమి టీల అధ్యక్షుల నియామకంలో పలువురు సీని యర్ నేతలు గరమవుతున్నారు. ప్రత్యేకించి ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలు పీసీసీ చీఫ్ రేవంత్ ఎదుట బహిరంగంగా నిరసన తెలి పారు. మునుగోడు నియోజకవర్గ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డి, పున్నా కైలాశ్ నేత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము చెప్పినోళ్లకు ఒక్క పదవి కూడా ఇవ్వలేదని అసంతృప్తిని వెళ్లగక్కారు. ఏకపక్షంగా పదవులను కట్టబెట్టా రని ఆరోపించారు. కార్యకర్తలు, అనుచరులతో గాంధీభవన్‌కు తరలివచ్చి రేవంత్ ఎదుట నిరసన తెలిపారు. తమకు న్యాయం చేయాలని, తమ వారికీ చాన్స్ ఇవ్వాలని కోరారు.
చలమల్ల కృష్ణారెడ్డికి బాధ్యతలు అప్పగించడంపై అసహ నం వ్యక్తం చేశారు. పార్టీ కమిటీల నియామకాల్లో మల్లు రవి ఎలా జోక్యం చేసుకుంటారని ప్రశ్నించారు. వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్లకు ఎలా అవకాశం ఇస్తారని ప్రశ్నించారు. అలా గే, భువనగిరికి చెందిన పలువురు నేతలు కూడా మండల కమిటీలపై అసహనం వ్యక్తం చేశారు. మల్లు రవి తీరును తప్పుబట్టారు. అయితే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం.. దీనిపై మరోలా స్పందించారు. నల్గొండ జిల్లా నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇచ్చిన లిస్టు ఆధారంగానే మండల కమిటీలకు అధ్యక్షులను నియమించామని స్పష్టం చేస్తున్నారు. తన ఆథరైజేషన్తోనే మల్లు రవి పనిచేస్తారని పేర్కొన్నారు.