ఫోన్ ట్యాపింగ్ పైసలతో లీడర్లను కొంటున్నరు : సంగప్ప, పెద్దిరెడ్డి

 ఫోన్ ట్యాపింగ్ పైసలతో లీడర్లను కొంటున్నరు : సంగప్ప, పెద్దిరెడ్డి
  • బీజేపీ నేతలు సంగప్ప, పెద్దిరెడ్డి

కరీంనగర్ సిటీ, వెలుగు : ఫోన్ ట్యాపింగ్ ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు పంపుతున్న సొమ్ముతో కాంగ్రెస్‌‌ లీడర్లు బీఆర్ఎస్‌‌కు చెందిన కార్పొరేటర్లను, ప్రజాప్రతినిధులను కొనాలని చూస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జెనవాడ సంగప్ప, మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి ఆరోపించారు. శుక్రవారం  కరీంనగర్ ఎంపీ ఆఫీసులో  మీడియాతో మాట్లాడుతూ కశ్మీర్ టూ కన్యాకుమారి వరకు ప్రజలు మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు.  

కేంద్రంలో బీజేపీని ఎదుర్కోలేక కాంగ్రెస్‌‌ రిజర్వేషన్ల రద్దు పేరుతో విషప్రచారం చేస్తోందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును నీరు గార్చేందుకు మంత్రి పొన్నం కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్‌‌ పైసలతోనే కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్‌‌కు టికెట్ ఇచ్చారని ఆరోపించారు.

లోక్‌‌సభ ఎన్నికల అనంతరం పొన్నం మంత్రి పదవి ఊడడం ఖాయమన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మ జయశ్రీ, కన్న కృష్ణ  తదితరులు పాల్గొన్నారు.