రాజన్నసిరిసిల్ల, కోనరావుపేట, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నియోజకవర్గాల్లో బీజేపీ నుంచి పోటీ చేసేందుకు లీడర్లు హైదరాబాద్ లోని పార్టీ ఆఫీస్‌లో అప్లికేషన్లు ఇస్తున్నారు. వేములవాడ టికెట్కోసం శుక్రవారం కోనరావుపేట మండలం మల్కపేటకు చెందిన బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి బొల్లారం తిరుపతి అప్లై చేసుకున్నాడు.
ఇప్పటికే ఇదే టికెట్కోసం శివంగళపల్లి గ్రామానికి చెందిన ప్యాక్స్మాజీ చైర్మన్ మోతె గంగారెడ్డి అప్లై చేసుకున్నారు. సిరిసిల్ల నుంచి పోటీ చేసేందుకు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు శీలం రాజు అప్లై చేసుకున్నారు. ఆయన వెంట మద్దుల బుగ్గారెడ్డి, మీస సంజీవ్, నాగుల శ్రీనివాస్ ఉన్నారు.