యువత స్కిల్స్‌‌‌‌‌‌‌‌ పెంచడంపై ఫోకస్‌‌‌‌‌‌‌‌ పెట్టాలె

యువత స్కిల్స్‌‌‌‌‌‌‌‌ పెంచడంపై ఫోకస్‌‌‌‌‌‌‌‌ పెట్టాలె
  • సీఐఐ కాన్‌‌‌‌‌‌‌‌క్లేవ్‌‌‌‌‌‌‌‌లో ప్రముఖులు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు :  ప్రతి ఏడాది కోటి మంది యువత జాబ్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లోకి ఎంటర్ అవుతున్నారని,  వీరికి స్కిల్స్ నేర్పించడం చాలా అవసరమని  సైయంట్‌‌‌‌‌‌‌‌ ఫౌండర్ చైర్మన్‌‌‌‌‌‌‌‌, సీఐఐ సదర్న్‌‌‌‌‌‌‌‌ రీజియన్‌‌‌‌‌‌‌‌ మాజీ చైర్మన్ బీవీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మోహన్ రెడ్డి అన్నారు. కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) – సదర్న్ రీజియన్ శుక్రవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన ఓ కాన్‌‌‌‌‌‌‌‌క్లేవ్‌‌‌‌‌‌‌‌లో ఆయన మాట్లాడారు. సక్సెస్ సాధించడంలో  స్కిల్స్ అప్‌‌‌‌‌‌‌‌గ్రేడ్ చేసుకోవడం కీలకమని అన్నారు.  గ్లోబల్‌‌‌‌‌‌‌‌ ఇన్నోవేషన్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌లో 130 దేశాల్లో  40వ స్థానాన్ని ఇండియా దక్కించుకుందని, గత పదేళ్లలో ర్యాంక్ బాగా పెరిగిందని వివరించారు. స్టార్టప్‌‌‌‌‌‌‌‌ ఎకోసిస్టమ్‌‌‌‌‌‌‌‌ను డెవలప్‌‌‌‌‌‌‌‌ చేసేందుకు  పాలసీ లెవెల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బోలెడు అవకాశాలు ఉన్నాయని మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌ (మిధాని) ఎండీ ఎస్‌‌‌‌‌‌‌‌కే ఝా అన్నారు.  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో డిఫెన్స్‌‌‌‌‌‌‌‌ సెక్టార్ నుంచి 25 పెద్ద కంపెనీలు, వెయ్యికి పైగా ఎంఎస్‌‌‌‌‌‌‌‌ఎంఈ కంపెనీలు ఉన్నాయని, స్ట్రాటజిక్ మిస్సైల్స్‌‌‌‌‌‌‌‌ను తయారు చేయడంలో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ పేరుగాంచిందని  పేర్కొన్నారు. డిఫెన్స్‌‌‌‌‌‌‌‌, ఏరోస్పేస్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆత్మ నిర్భర భారత్‌‌‌‌‌‌‌‌ను చేరుకోవడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇప్పటికే డిఫెన్స్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.21 వేల కోట్ల ఎక్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ సాధించామని వివరించారు. ఇందులో  60 శాతం ప్రైవేట్ సెక్టార్ నుంచి, 40 శాతం ప్రభుత్వ కంపెనీల నుంచి సాధించామన్నారు.  2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే  అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సర్వీసెస్ సెక్టార్లపై ఫోకస్ పెట్టాలని భారత్ బయోటెక్‌‌‌‌‌‌‌‌ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి ప్రసాద్ అన్నారు.  ఈ ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో రాష్ట్ర ఇండస్ట్రీస్‌‌‌‌‌‌‌‌ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జయేష్ రంజన్, సీఐఐ తెలంగాణ చైర్మన్ సీ శేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.