నాయకులారా తస్మాత్ జాగ్రత్త

హైదరాబాద్: ఉగాది సందర్భంగా శనివారం ప్రగతి భవన్ లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పంచాంగ శ్రవణంలో భాగంగా పంచాంగ కర్త బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘యాదాద్రి నరసింహుడికి ఉన్నట్లే సీఎం కేసీఆర్ కు మూడో నేత్రం ఉంది. ఎవరెవరు ఏం చేస్తున్నారో, ఎవరిని కలుస్తున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో.. అన్ని విషయాలను కేసీఆర్ గమనిస్తున్నారు. కాబట్టి నాయకులు జాగ్రత్తగా ఉండాలి’ అని అన్నారు. దీంతో ఆ ప్రాంగణమంతా నవ్వులతో నిండిపోయింది. సీఎం కేసీఆర్ కూడా ముసిముసిగా నవ్వుతూ కనిపించారు. అలాగే మీడియా వాళ్లు ఈ ఏడాది వార్తలు వెతుక్కోవాల్సిన అవసరం లేదని, కడుపునిండుగా వార్తలు దొరకుతాయని శాస్త్రి చెప్పారు. 
 

మరిన్ని వార్తల కోసం...

భద్రాద్రి రామయ్య కల్యాణ వేడుకలు షురూ

కలలు గంటడు.. కన్నమేస్తడు