కడెం, వెలుగు: కడెం మండలం పెద్దూర్ గ్రామంలో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అభిమానులు ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాత్రి ధ్వంసం చేసి, వాటిపై పేడ కొట్టారు. విషయం తెలుసుకున్న పార్టీ మండల నాయకులు కడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ చర్యకు పాల్పడివారిపై చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. వారి ఫిర్యాదు మేరకు ఎస్సై కోసన రాజు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.