మాజీ ప్రధాని, సీనియర్ కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్ మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. మన్మోహన్ కుటుంబ సభ్యులకు మోదీ ఫోన్ చేసి సంతాపం తెలిపారు. ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి తీరని లోటు అని రాహుల్ గాంధీ అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ భౌతిక కాయాన్ని సందర్శించేందుకు కాంగ్రెస్ నేతలు, మరోవైపు బీజేపీ నేతలు ఒక్కొక్కరుగా ఢిల్లీ ఎయిమ్స్ కు చేరుకుంటున్నారు. రాహుల్, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ఢిల్లీ ఎయిమ్స్ కు చేరుకున్నారు. జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డా తో సహా బీజేపీ నేతలు ఢిల్లీ ఎయిమ్స్ కు చేరుకున్నారు. ప్రముఖుల రాకతో ఎయిమ్స్ ముందు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
ALSO READ | మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత