
నెట్వర్క్, వెలుగు: ఆదిలాబాద్ పార్లమెంట్‌స్థానంలో గొడం గనేశ్, పెద్దపల్లి స్థానంలో వంశీకృష్ణ విజయం సాధించడంతో ఉమ్మడి ఆదిలాబాద్జిల్లా వ్యాప్తంగా బీజేపీ, కాంగ్రెస్ నేతలు సంబురాల్లో మునిగిపోయారు. కాంగ్రెస్ నేత గడ్డం వంశీకృష్ణ భారీ మెజార్టీతో సాధించడంతో మంచిర్యాల జిల్లాలోని పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో నేతలు, కార్యకర్తలు డ్యాన్సులతో హుషారెత్తించారు.
పటాకులు పేల్చి, రంగులు చల్లుకుని సంతోషాన్ని పంచుకున్నారు. సోనియా, రాహుల్‌గాంధీ, వివేక్ వెంకటస్వామి, గడ్డం వినోద్, వంశీకృష్ణకు జేజేలు పలికారు. మంచిర్యాలలోని ఎమ్మెల్యే వివేక్ ఇంటి వద్ద ఉదయం నుంచే సందడి నెలకొంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనను కలిసి అభినందలు తెలిపారు. వారి ఇంటి వద్ద సాయంత్రం లీడర్లు, కార్యకర్తలు డ్యాన్సులు చేస్తూ సంబరాల్లో మునిగితేలారు. వేడుకల్లో వివేక్, వంశీకృష్ణ సైతం డ్యాన్స్ చేశారు.