బీఆర్‌ఎస్, కాంగ్రెస్ లీడర్లు బుధవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోటాపోటీగా ఆందోళనలు నిర్వహించారు. ఉచిత విద్యుత్‌పై రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్‌ఎస్ లీడర్లు ఆయన దిష్టిబొమ్మలు దహనం చేశారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ నాయకులు వక్రీకరిస్తున్నారంటూ కాంగ్రెస్ లీడర్లు సబ్‌స్టేషన్ల వద్ద సీఎం కేసీఆర్ ఫ్లెక్సీ, దిష్టిబొమ్మల దహనం చేసి రాస్తారోకో నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీల జిల్లా అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
- వెలుగు నెట్‌వర్క్