
- ఐక్యంగా కదులుతున్న పెద్దపల్లి
- ఊరూరా ప్రచారంలో నాయకులు
- అండగా నిలుస్తున సింగరేణి కార్మికులు
- కలిసి వస్తున్న కర్షకులు, కూలీలు
- ప్రచారంలో పాల్గొంటున్న యువత
గోదావరిఖని/మంచిర్యాల: పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపుకోసం కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, జనసమితి నాయకులు, కార్మిక, ప్రజాసంఘాల నాయ కులు విశేషంగా కృషి చేస్తున్నారు. స్వచ్ఛందంగా వచ్చి ప్రచారంలో పాల్గొంటున్నారు. సింగరేణి బొగ్గుబావుల దగ్గర క్యాంపెయిన్ కొనసాగింది. గేటు మీటింగ్ లు ఏర్పాటు చేసి కార్మికులను కలిసి ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. కార్మికులను కర్షకులను కలుపుకొని పోతూ ప్రచార పర్వం కొనసాగుతోంది. నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో నిర్వహించిన సన్నాహాక సమావేశాలు కొత్త జోష్ నింపాయి. మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో ఎమ్మెల్యేలు విజయరమణారావు, మక్కన్ సింగ్ ఠాకూర్, ప్రేమ్ సాగర్ రావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, గడ్డం వివేక్ వెంకటస్వామి, గడ్డం వినోద్ ఆధ్వర్యంలో ఊరూరా ప్రచారం కొనసాగింది.
పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, ఐఎన్టీయూసీతో పాటు ఇతర కార్మిక సంఘాలు కలిసి మున్ముందుకు సాగాయి. దీంతో వంశీ భారీ మెజార్టీతో గెలుపు ఖాయమై పోయిందనే టాక్ వినిపిస్తోంది.