
చేర్యాల, వెలుగు: తెలంగాణ ముదిరాజ్ సంఘం జేఏసీ జనరల్సెక్రటరీ భీమా లక్ష్మణ్ ఆధ్వర్యంలో శుక్రవారం పలువురు ముదిరాజ్ నాయకులు సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ముదిరాజ్సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. స్పందించిన సీఎం ముదిరాజ్‌లకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత నామినేటెడ్ పోస్టుల్లో అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు భీమా లక్ష్మణ్ తెలిపారు. కార్యక్రమంలో కన్వీనర్ లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ సుధాకర్, మహిళా కన్వీనర్ పుష్పలత పాల్గొన్నారు.