వైరా, వెలుగు : రానున్న ఎన్నికల్లో వైరా సీటును కాంగ్రెస్‌పార్టీకే కేటాయించాలని హైకమాండ్‌ను ఆ పార్టీ నేతలు కోరారు. పొత్తుల పేర వైరా సీటును వామపక్షాలకు కేటాయించ వద్దని టీపీసీసీ కార్యదర్శి కట్ల రంగారావు, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు పగడాల మంజుల కోరారు. పార్టీ మండల ఆఫీసులో విలేకర్లతో మాట్లాడారు.
కాంగ్రెస్ అభ్యర్థికి ఇస్తే సీటును గెలిపిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో నున్న కృష్ణయ్య, ఉప్పెర్ల ఆనంద్ ప్రసాద్, ధరావత్ బద్రు నాయక్, కట్ల సంతోష్, రేచర్ల నాగేశ్వరరావు, రేచర్ల రాముడు, లక్ష్మీపురం ఉప సర్పంచ్రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.