5 ఎకరాల వరకే రైతుబంధు ఇవ్వాలి

హుజూరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రైతుబంధు పథకాన్ని 5 ఎకరాల వరకే వర్తింపజేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్​చేశారు. ఈ మేరకు శనివారం హుజూరాబాద్​తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వినతిపత్రం అందజేశారు.  ఈ సందర్భంగా లీడర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం  వందల ఎకరాలు ఉన్న భూస్వాములకు , గుట్టలకు, కొండలకు, బీడు భూములకు కూడా రైతుబంధు ఇస్తూ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని ఆరోపించారు.

దీనివల్ల నిరుపేదలైన సన్న కారు, కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వాపోయారు. 5 ఎకరాలు ఉన్నవారికే రైతుబంధు ఇచ్చి మిగిలిన మొత్తాన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల పిల్లలకు విద్య, ఉపాధి అవకాశాలకు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లీడర్లు వేల్పుల రత్నం,  ఖాలీద్ హుస్సేన్, జనార్దన్, శేఖర్, గోపాలరావు, సమ్మయ్య, రవీందర్, ప్రభాకర్ పాల్గొన్నారు.