ఎన్నికలంటేనే కాంగ్రెస్‌ నాయకులకు చలిజ్వరం: KTR

2001లో జెడ్పీ ఎన్నికల్లో మొత్తం ఆలేరు నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగిరిందన్నారు TRS వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌కు ప్రజలు ఘన విజయం కట్టబెట్టారని చెప్పారు. కాంగ్రెస్‌తో ఏమీ కాదని అసెంబ్లీ ఎన్నికల్లోనే తేలిపోయిందన్నారు. పెద్ద పెద్ద కాంగ్రెస్ నేతలు ప్రజల చేత తిరస్కరించబడ్డారని తెలిపారు. ఇవాళ  తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆలేరు నియోజకవర్గానికి చెందిన పలు పార్టీల నేతలు కేటీఆర్  సమక్షంలో TRSలో చేరారు. ఆయా పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలకు KTR గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్…ఎన్నికలు వస్తున్నాయంటే కాంగ్రెస్ నాయకులకు చలిజ్వరం పట్టుకుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో TRSను ఎందుకు గెలిపించాలో..కార్యకర్తలు గ్రామ గ్రామాన వివరించాలన్నారు.

కేంద్రంలో ఎవరు మంత్రిగా ఉంటే వాళ్ల రాష్ట్రాలకే ప్రయోజనాలు కలుగుతున్నాయన్నారు కేటీఆర్. రైతు బంధు, రైతు బీమా,మిషన్ భగీరథ లాంటి పథకాలు ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. రాహుల్‌గాంధీ పరిస్థితి ఏమాత్రం బాగాలేదన్నారు.NDA 150, UPAకు100 సీట్లకు మించి వచ్చే పరిస్థితి లేదన్నారు కేటీఆర్.