సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట మున్సిపల్ చైర్‌పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణపై కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసాన్ని ఉపసంహరించుకోవాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక రైతు బజారు వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తలమల్ల హసేన్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు చింతలపాటి చిన్న శ్రీరాములు, తప్పెట్ల శ్రీరాములు, బీఆర్‌ఎస్ నేత గుండగాని నాగభూషణం మాట్లాడుతూ.. దళిత మహిళపై అవిశ్వాసం అగ్రవర్ణాల కుట్రపూరిత చర్య అని ఆరోపించారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఏకమై అవిశ్వాసాన్ని తిప్పికొట్టేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం పోలీసులు రాస్తారోకో చేస్తున్న వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు బోలెద్దు దశరథ, బోడ శ్రీరాములు, పాలడుగు పరశురాములు, అశోధా రవి, దాసరి దేవయ్య, దైదా వెంకన్న, మద్దూరి కుమార్ తదితరులు పాల్గొన్నారు