యాదాద్రి, వెలుగు : టెన్త్ స్టూడెంట్స్ మృతిపై సమగ్ర న్యాయ విచారణ జరపాలని వివిధ పార్టీల నేతలు డిమాండ్ చేశారు. ఆదివారం స్టూడెంట్స్ ఫ్యామిలీలతో కలిసి భువనగిరిలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు లీడర్లు మాట్లాడుతూ.. ఎడ్యుకేషన్, ఎస్సీ వెల్ఫేర్ఆఫీసర్ల నిర్లక్ష్యం కారణంగానే స్టూడెంట్స్ ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. వారికి ఎక్స్‌గ్రేషియా అందించడంతో పాటు వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
విషయం తెలుసుకున్న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, అడిషనల్ కలెక్టర్ భాస్కర్‌రావు, ఇతర ఆఫీసర్లు అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకారులతో చర్చలు జరిపి.. ప్రభుత్వం తరఫున న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఇద్దరు స్టూడెంట్స్కుటుంబ సభ్యులకు రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు. అంత్యక్రియలు పూర్తయ్యేంతవరకూ ఆఫీసర్లు పర్యవేక్షించాలని ఆదేశించారు.