వికారాబాద్ జిల్లాలో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన మహిళ మృతి

వికారాబాద్ జిల్లాలో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన మహిళ మృతి

వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో వారం రోజులక్రితం ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఓ మహిళ.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. వికారాబాద్ జిల్లా కుల్కచర్లలోని గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో పారిశుధ్య కార్మికురాలిగా గతంలో పని చేసిన మహిళ.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో సుజాత పారిశుధ్య కార్మికురాలిగా పని చేస్తున్న క్రమంలో.. వివిధ కారణాలు చూపుతూ తనను ప్రిన్సిపల్ అనవసరంగా విధుల నుండి తొలగించారంటూ ఆరోపిస్తూ  ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. తీవ్ర మనస్తాపంతో సుజాత పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 

వారం రోజుల నుంచి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. సుజాత మృతికి కారణమైన ప్రిన్సిపాల్ ను వెంటనే సస్పెండ్ చేసి, ఆమె కుటుంబ సభ్యులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ వివిధ ప్రజాసంఘాల నాయకులు నిరసన తెలిపారు. కుల్కచర్ల చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం కుల్కచర్ల తహశీల్దార్ కు వినతిపత్రం అందజేశారు.