దిమ్మదుర్తిలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం

లక్ష్మణచాంద (మామడ), వెలుగు: గుర్తుతెలియని వ్యక్తులు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన మామడ మండలంలోని దిమ్మదుర్తి గ్రామంలో జరిగింది. దిమ్మదుర్తి అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు అందె పోశన్న వెల్లడించిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు బస్టాప్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహంపై దాడి చేసి కుడి చేతిని పూర్తిగా ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న మండలంలోని యువజన సంఘాల నాయకులు శనివారం ఘటనా స్థలానికి చేరుకొని రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. 

ALSO READ: గంజాయిపై ఉక్కుపాదం..పీడీ యాక్టు కింద జైలుకు పంపుతం​ : సత్యనారాయణ

బాధ్యులపై కేసులు నమోదు చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా ఎస్సీ, ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ అధ్యక్షుడు డి.రాములు ఇతర నేతలు మామడ పోలీస్ స్టేషన్​లో కంప్లైంట్ చేశారు. సోన్ సీఐ నవీన్ కుమార్, లక్ష్మణచాంద ఎస్సై శ్రీకాంత్​ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.