
కోల్బెల్ట్, వెలుగు : తమ సమస్యలు పరిష్కరించాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి గొర్రె, మేకల పెంపక వృత్తిదారుల సంఘం లీడర్లు వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్లో ఎమ్మెల్యే వివేక్ను గురువారం వారు కలిశారు. రెండో విడత గొర్రెల కోసం డీడీలు కట్టిన గొర్రెల కాపరులని ఆదుకోవాలని కోరారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్, భూపాలపల్లి, వనపర్తి జిల్లాల అధ్యక్షులు గజ్జి రమేశ్ యాదవ్, మధు యాదవ్ పాల్గొన్నారు.