కాంగ్రెస్‌‌లో చేరికలు : జాటోత్‌‌ శ్రీనివాస్‌‌ నాయక్‌‌

పర్వతగిరి/నెక్కొండ/మొగుళ్లపల్లి/నర్సంపేట, వెలుగు : ఉమ్మడి వరంగల్‌‌ జిల్లాలోని పలు పార్టీల లీడర్లు బుధవారం కాంగ్రెస్‌‌లో చేరారు. వరంగల్‌‌ జిల్లా పర్వతగిరి మండలంలో జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్‌‌రావు, జాటోత్‌‌ శ్రీనివాస్‌‌ నాయక్‌‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌‌లో చేరిన వరికి రిటైర్డ్​ సీపీ నాగరాజు కండువాలు కప్పి ఆహ్వానించారు. నెక్కొండ  మండలంలోని దీక్షకుంట, సాయిరెడ్డిపల్లి, నర్సంపేట పట్టణానికి చెందిన లీడర్లు మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌‌లో చేరారు. అలాగే భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి, టేకుమట్ల మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన నాయకులు కాంగ్రెస్‌‌లో చేరగా వారికి గండ్ర సత్యనారాయణరావు కండువా కప్పి ఆహ్వానించారు. 

ALS0 READ: కూన శ్రీశైలం గౌడ్​పై ఎమ్మెల్యే వివేకానంద దాడి