హైదరాబాద్లో ఓటేసిన లీడర్లు

హైదరాబాద్లో ఓటేసిన లీడర్లు

హైదరాబాద్, వెలుగు: లోక్‌సభ ఎన్నికల సందర్భంగా గ్రేటర్ ​హైదరాబాద్ ​పరిధిలోని పలు పోలింగ్ ​కేంద్రాల్లో వివిధ పార్టీల నాయకులు, అధికారులు, పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్​లోని ఓబుల్ రెడ్డి పబ్లిక్​ స్కూల్​లో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తన భార్యతో కలిసి వచ్చి ఓటు వేశారు. అల్వాల్​లో మైనంపల్లి హనుమంతరావు, అంబర్​పేటలో బీఆర్ఎస్​ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్​ ఫ్యామిలీ మెంబర్స్​తో కలిసి వచ్చి ఓటు వేశారు. 

ముషీరాబాద్​లోని కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఎదురుగా ఉన్న వెస్ట్ వింగ్​లో రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, రాంనగర్ లోని జేవీ హైస్కూల్​లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మలక్ పేట సలీమ్ నగర్​లోని జీహెచ్ ఎంసీ కమ్యూనిటీ హాల్ లో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, ధర్మసాగర్ గ్రామంలో చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, డీడీ కాలనీలో మురళీధర్ రావు, మలక్ పేటలోని తిరుమల హిల్స్​లో ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, తార్నాకలో మాజీ ఎమెల్సీ రాంచందర్ రావు ఓటు వేశారు. షేక్​ పేట తహసీల్దార్​ ఆఫీసులో  ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి కుటుంబసభ్యులతో కలిసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

మారేడుపల్లిలోని కస్తూర్బా కాలేజీలో సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, మోండా మార్కెట్​ లోని ఇస్లామియ హైస్కూల్​లో సికింద్రాబాద్ బీఆర్​ఎస్​ఎంపీ అభ్యర్థి టి.పద్మారావు గౌడ్, బంజారాహిల్స్ ఎన్​బీ టీ నగర్ ప్రభుత్వ స్కూల్​లో రాజ్యసభ ఎంపీ కె.కేశవ​రావు, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, రహీంపురాలోని ఎస్ఎస్కే డిగ్రీ కాలేజీలో రాజాసింగ్, కంటోన్మెంట్ బోయిన్ పల్లిలో మాజీ మంత్రి మల్లారెడ్డి తమ ఓటు వేశారు. జూబ్లీహిల్స్‌‌లోని సెంట్రల్‌‌ నర్సరీ స్కూల్‌‌లో డీజీపీ రవిగుప్తా, అడిషనల్ డీజీలు మహేశ్​ భగవత్‌‌, శిఖాగోయల్‌‌, ఏసీబీ డీజీ సీవీ ఆనంద్‌‌, సిటీ పోలీస్ కమిషనర్‌‌‌‌ శ్రీనివాస్​ రెడ్డి, రాచకొండ సీపీ తరుణ్‌‌ జోషి, సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి తమ కుటుంబ సభ్యులతో వచ్చి ఓటు వేశారు.