పనిచేసే ప్రతి ఒక్కరికీ గుర్తింపు : చల్లా ధర్మారెడ్డి

  • పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

పర్వతగిరి/పరకాల, వెలుగు : బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీలో పనిచేసే ప్రతిఒక్కరికీ గుర్తింపు ఉంటుందని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరకాల క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చల్లా ధర్మారెడ్డి అన్నారు. వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా గీసుగొండ మండలం హర్జ్యాతండా, పరకాల, ఆత్మకూరు, గీసుకొండతో పాటు గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విలీన గ్రామాలకు చెంది పలువురు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరారు. వారికి కండువాలు కప్పి ఆహ్వానించిన అనంతరం చల్లా మాట్లాడారు. తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిచిందన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమన్నారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేనిఫెస్టోలోని ఆరు గ్యారంటీలకు వారంటీ లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్ల మాయమాటలు నమ్మి మోసపోవద్దన్నారు.

ప్రతిపక్ష నాయకుల పాలనలో ఉన్న రాష్ట్రాల్లో ఏ పథకాలు అమలు చేస్తున్నారో ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పరకాల నియోజకవర్గ టీడీపీ నాయకులను ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి గన్నోజు శ్రీనివాసాచారి మోసం చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విజయం కోసం కార్యకర్తలు కృషి చేయాలని, కష్టపడిన ప్రతీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని చెప్పారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బీజేపీ నాయకులకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. పర్వతగిరిలో ఆంగోతు కవిత -మహబూబ్, నాయకులు వీరన్న, నరసింహ, లెనిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, శ్రీకాంత్, ప్రమోద్, హరి, రాజు, భద్రు పాల్గొన్నారు.

Also Read:- సోనియా గాంధీ అనుకుంటే సీఎం అవుతా : కోమటిరెడ్డి వెంకటరెడ్డి