జైనూర్, వెలుగు: జైనూరు గవర్నమెంట్ హాస్పిటల్‌లో డాక్టర్లను నియమించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీల సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం మెయిన్ రోడ్డుపై లీడర్లు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏజెన్సీ మెస్రం మనోహర్ మాట్లాడుతూ.. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా జైనూర్‌లోని గవర్నమెంట్ హాస్పిటల్‌లో డాక్టర్లను నియమించలేదని సరైన సౌకర్యాలు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజా ప్రతినిధులు, అధికారులకు పలుమార్లు విన్నవించినా ప్రయోజనం లేదన్నారు. దీంతో గర్భిణిలు ట్రీట్మెంట్ కోసం అనేక కష్టాలు పడాల్సి వస్తుందన్నారు. జైనూర్ హాస్పిటల్లో డాక్టర్లను నియమించి పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం పై అధికారులకు అందజేస్తామని డిప్యూటీ తహసీల్దార్ ఇచ్చిన హామీ మేరకు వారు ఆందోళన విరమించారు. జిల్లా గౌరవ అధ్యక్షుడు మెస్రం షేకు, మండల అధ్యక్షుడు మెస్రం మక్కు, రాయిసెంటర్ సర్మేడిలు జూగ్నక్ దేవురావు, ఆత్రం ఆనంద్ రావు, ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.