
హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ దర్శకుల్లో పూరీ జగన్నాథ్ ఒకరు. బద్రీ, ఇడియట్, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, పోకిరి, ఇస్మార్ట్ శంకర్ లాంటి సూపర్ హిట్ సినిమాలు తీసి తెలుగు ప్రేక్షకుల్లో ఆయన ఓ ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పరుచుకున్నారు. వేగంగా స్క్రిప్ట్ రాసి.. అంతేవేగంగా సినిమాను తెరకెక్కించడంలో ఆయనది అందెవేసిన చెయ్యి. అయితే రౌడీస్టార్ విజయ్ దేవరకొండతో తీస్తున్న తెరకెక్కిస్తున్న ‘లైగర్’ మాత్రం కాస్త ఆలస్యమవుతోంది. ఈ విషయాన్ని పక్కనబెడితే. పూరి జగన్నాథ్ యాక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చారట. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి బయట పెట్టారు.
వెండితెరపై నటుడిగా వెలుగు వెలగాలని, ఎన్నో ఆశలతో పూరీ జగన్నాథ్ నర్సీపట్నం నుంచి హైదరాబాద్ కు వచ్చారని చిరు చెప్పారు. ఈ క్రమంలో ఒకటి అరా వేషాలూ వేశారన్నారు. ఇంతలో కాల చక్రం తిరిగి.. స్టార్ డైరెక్టర్ అయిపోయారన్నారు. కానీ ఆయన మొదటి కల అలా మిగిలిపోకూడదని.. తాను ప్రస్తుతం నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ సినిమాలో పూరీకి స్పెషల్ రోల్ ఆఫర్ చేశానని చిరు ట్వీట్ చేశారు. చిత్ర సెట్స్ లో పూరీ జాయిన్ అయిన ఫొటోలను షేర్ చేశారు. ఇందులో ఖైదీ పాత్రలో చిరు కనిపిస్తున్నారు. ఇకపోతే, ‘హనుమాన్ జంక్షన్’ ఫేమ్ మోహన్ రాజా.. గాడ్ ఫాదర్ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆయన టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తున్నారు.
నర్సీపట్నం నుంచి ఓ కుర్రాడు,వెండితెర పైన నటుడిగా వెలుగు వెలగాలని,హైదరాబాద్ వచ్చాడు.ఒకటి అరా వేషాలు వేసాడు ఇంతలో కాలం చక్రం తిప్పింది.స్టార్ డైరెక్టర్ అయ్యాడు.కానీ అతని మొదటి కల అలా మిగిలిపోకూడదు కదా..అందుకే
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 9, 2022
introducing my @purijagan in a special role,from the sets of #Godfather pic.twitter.com/8NuNuoY33j
మరిన్ని వార్తల కోసం: