రాముడి వంశస్థులమంటూ ఐదుగురు!

అయోధ్య కేసు విచారణ సందర్భంగా అసలిప్పుడు రాముని వంశం వాళ్లు ఎవరైనా ఉన్నారా? అంటూ సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్య చేసింది. ఆ వెంటనే రాజస్థా న్ కి చెందిన రాజ కుటుంబాలవారు మేం రాముని ఫ్యామిలీయే అంటూ ముం దుకొస్తున్నారు. హిందూ పురాణాలప్రకారం నాలుగు యుగాలుగా కాల విభజన జరిగింది. దీనిలో త్రేతా యుగం రెండోది కాగా, ప్రస్తుతం నడుస్తున్న కలి యుగం నాలుగోది. రెండింటి నడుమ కొన్ని వేల ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు క్లెయిమ్ చేసుకుంటు న్నవారంతా సీతారాముల

సంతానమైన లవ–కుశులకు చెందినవాళ్లమని అంటున్ నారు. వీళ్ల పుణ్యాన రాముడి సంతానపు విశేషాలన్నీ బయటకొస్తున్నాయి.

ఉన్నట్టుండి ‘మేము అయోధ్యను పాలించిన శ్రీరాముడి వారసులం’ అంటూ కొందరు ముందుకొ-చ్చారు. త్రేతాయుగం నాటి రాములవారి వారసులుఈ కలియుగంలో ఇంకా ఉన్నా రా అనే సందేహం తలె-త్తడం సహజం. వారసులుగా క్లెయిమ్ చేసుకుంటున్న-వాళ్లు రాజస్థా న్ కి చెందిన రాచరిక కుటుంబాలవారే.జైపూర్ , ఉదయపూర్, మేవాడ్ ల లో రద్దయిన సంస్థా -నాలవాళ్లు, రాజస్థా నీ ట్రాన్స్ పోర్ట్​ మినిస్టర్ ప్రతాప్సింగ్ కచారియావాస్ , రాజస్థా న్ కాంగ్రెస్ కమిటీఅధికార ప్రతినిధి సతేంద్ర రాఘవ్ , శ్రీ రాజపుత్ కర్నీసేన ప్రెసిడెంట్ లోకేంద్ర సింగ్ కల్వి… ఎవరికి వారేతాము రాముడి సంతానమైన లవ–కుశలకు వారసు-లమని చెప్పుకుంటున్నా రు.

అయోధ్య కేసు విచారణ సమయంలో… ‘రాముడివారసులు ఎవరైనా ఉన్నా రా?’ అని సుప్రీం కోర్టుబెంచ్ అడగడంతో ఒకరి తరువాత ఒకరు వరుసగా‘మేమంటే మేము’ అంటూ వారసత్వం క్లెయిమ్ లతోవస్తున్నారు. మొట్టమొదటగా రాజ్ సమంద్ (జైపూర్)కి చెందిన లోక్ సభ సభ్యురాలు దియా కుమారి తానుకుశుడి వంశానికి చెందిన రాజకుమారినని ప్రకటిం-చారు. సీతారాములకు కలిగిన కవల పిల్లల్లో కుశుడుపెద్దవాడని, లవుడు చిన్నవాడని పురాణ సాహిత్యాన్ని-బట్టి ప్రజల విశ్వాసం. దియాకుమారి వాదన ప్రకారంఆమె కుశ్వా హ లేదా కచ్వా వంశానికి చెందిన రాజ-వంశీయురాలు. జైపూర్ సిటీ ప్యాలెస్ మ్యూజియంలోఓఎస్ డిగా పనిచేస్తున్న రామ్ రామ్ దేవ్ కూడా దీనినేసమర్థిస్తున్నా రు. ప్యాలెస్ ఆర్కైవ్స్ లో రాజుల జీనియా-లజీ (వంశావళి) మొత్తం ఉందంటున్నా రు. ఈ వం-శావళిలో దశరథ మహారాజు రఘువంశంలో 62వరాజు, అతని పెద్ద కుమారుడైన రాముడు 63, పెద్దమనవడైన కుశుడు 64వ రాజులుగా రాసి ఉందట.దశరథుడి రాజ్యం కోసల. దీనికి రాజధాని అయోధ్యపట్టణం. కోసల రాజ్యానికి ఉత్తర ప్రాంతాన్ని లవుడుపాలించినట్లుగా, దక్షిణ ప్రాంతాన్ని కుశుడు పా-లించినట్లుగా రాజస్థా నీ రాజవంశీయులు వివ-రణనిస్తున్నారు. కుశుడు పాలించిన ప్రాంతమేప్రస్తుతం చత్తీస్ గఢ్ ఏరియాగానూ, లవుడుపాలించిన కోసల ఉత్తర భాగం జమ్మూ వరకువిస్తరించిం దని వాదిస్తున్నా రు.

రామ్ రామ్ దేవ్ చెబుతున్న ప్రకారం చూస్తే…జైపూర్ ప్యాలెస్ లో అయోధ్య సంస్థా నానికిసంబంధించి అనేక ఆసక్తికర డాక్యుమెంట్లుఉన్నా యి. 1699–1743 మధ్య కాలంలోఆమేర్ –జైపూర్ ని పాలించిన సవాయి రాజా జైసింగ్మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు చనిపోయిన పదేళ్లకుఅయోధ్యలోని రామ్ కోట్ భూమిని కొన్నా రు. అక్కడే1710లో రామ మందిరాన్ని, తన పేరు మీద జైసింగ్పురా అనే పట్టణాన్ని నిర్మించా రు. వీటి నిర్మాణందాదాపు ఏడేళ్లపాటు సాగింది. అలాగే, జైపూర్ లోనిరాజస్థా న్ యూనివర్శిటీకి చెందిన హిస్టారియన్ఆర్ .నాథ్ తన పుస్తకంలో… కచ్వా వంశీయులకుచెందినదే అయోధ్యలోని జైసింగ్ పురా అంటున్నా రు.రామ మందిరం ఈ జైసింగ్ పురాలోనే ఉంది. అయితే,అయోధ్కకు చెందిన వీరందరూ రాజస్థా న్ కి ఎప్పుడుతరలివచ్చారు, ఎందుకు అయోధ్యను విడిచిపెట్టేశా-రు? అనే వివరాలేవీ తెలియరాలేదు.

జైపూర్ రాజవంశీయురాలు, రాజ్ సమంద్ ఎంపీదియా కుమారి మాత్రం సుప్రీం కోర్టులో నలుగుతున్నకేసులో తాను కూడా ఇంప్లీ డ్ అవుతానంటున్నా రు.అ యోధ్య భూమికి సంబంధిం చిన డాక్యుమెం ట్ల-న్నీ ప్యాలెస్ లో ఉన్నా యని, వాటిని కోర్టుకి సబ్మిట్చేస్తానని చెబుతున్నా రు. 1992లోనే ఆమె తండ్రిసవాయి భవానీ సింగ్ అలహాబాద్ హైకోర్టుకి కొన్నిడాక్యుమెంట్లు సమర్పించా రు. సీతారాముల సంతా-నమైన లవ కుశులతోపాటు వారి వంశానికి చెందిన-వారు దేశంలోని చాలా చోట్లకు విస్తరించారని, కచ్వావంశం అనేక శాఖలుగా విడిపోయిందని, వాటిలోఒకటైన ఖంగరోత్ వంశీయులు జమ్మూ రాజ్యాన్నిపాలించా రని రామ్ రామ్ దేవ్ వివరిస్తున్నారు. వీ-రందరికీ వంశ మూల పురుషుడు రఘు మహారాజేఅంటున్నా రు.

వీళ్ల వాదన ఇలా ఉంటే… దియా కుమారి చెబుతు-న్నట్లుగా కుశుడికి అయోధ్య ఉత్తర ప్రాంతానికిసం బంధమే లేదంటున్నా రు కొందరు. కుశుడుపాలించిన ప్రాంతం కోసల రాజ్యానికి దక్షిణ భాగమనివి వరిస్తున్నా రు. ఉదయ్ పూర్ కి చెందిన అరవింద్సింగ్ మేవాడ్ తానుసైతం రఘువంశానికి చెందిన-వాడినే అంటూ ట్వీట్ చేశారు. మాజీ ఉప రాష్ట్రపతిభైరాన్ సింగ్ షెకావత్ కి దగ్గర బంధువైన సతేంద్రరాఘవ్ రంగంలో దిగారు. వాల్మీకి రామాయణంలోనేపేజీలతోసహా ఉదాహరణలిస్తున్నా రు. తాము లవుడివంశానికి చెందినవాళ్లమని క్లెయిమ్ చేస్తున్నా రు. శ్రీరాజపుత్ కర్ని సేన ప్రెసిడెంట్ లోకేంద్ర సింగ్ కల్వి-కూడా ఈ ప్రాంతం లవకుమారుడి ఏలుబడిలోనిదనివాదిస్తున్నారు. దియాకుమారి కుశ్వా హ వంశీయు-రాలేనని, అయితే ఇక్కడ హక్కు లన్నీ లవుడికి చెంది-నవారివని కర్ని సేన అభ్యంతరం పెడుతోంది. ఇదిలాఉంటే, అయోధ్య రాజ కుటుంబానికి చెందిన విమ-లేంద్ర మోహన్ ప్రసాద్ మిశ్రా తాముకూడా రాముడివారసులమేనంటున్నా రు. ఈ వాదనను ఎవరూ అం-గీకరించడం లేదు. ఎందుకంటే, రాముడు క్షత్రియరాజు కాగా, మిశ్రాలు బ్రాహ్మణులు.

అయోధ్య వివాదానికి ఎలాంటి న్యా య పరిష్కారం లభి-స్తుందన్నది పక్కన బెడితే… రాములవారి తర్వాత చరిత్రఎవరికీ పెద్దగా తెలియదు. రాజస్థా న్ రాజకుటుంబాల వల్ల లవ–కుశులు పాలించిన ప్రాంతాలపై జనానికిఇప్పుడు ఒక అవగాహన ఏర్పడుతోంది.

ఇంతకీ దియా కుమారి ఎవరు?

రాజస్థా న్ లో ని రాజసమంద్ నుంచి బీజేపీ టికెట్టు పై లోక్ సభకు ఎన్నికయ్యా రు దియాకుమారి. జైపూర్రాజవంశీయురాలు. ‘మా కుటుంబానికి రాముడివారసత్వం ఉంది. మా నాన్న రఘు వంశంలో 309వతరానికి చెందినవాడు. మేము రాముడి కుమారుడైనకుశుడి వారసులమేనని రుజువు చేయడానికి తగినడాక్యు మెంట్లున్ నాయి. కుశుడి పేరుపై ఏర్పడినకుశ్వాహ (కచ్వా) వంశీయులం’ అనిమొట్టమొదట దియాకుమారిస్పందించారు. జైపూర్ రాచరికంలో చాలావరకు దత్తత తీసుకొని వారసత్వాన్ని కట్టబెట్టడమే జరిగిం ది. జైపూర్ రాజు భవానీ సింగ్ కి దియాఒక్కరే కూతురు కావడంతో, తన వారసుడిగా మనవడు (దియా పెద్ద కొడుకు) పద్మనాభ్ సింగ్ నిదత్తత తీసుకున్నారు.

మేమే అసలైన వంశీయులం

రాఘవ రాజపుత్రులు రాముడి కుమారుల్లోఒకరైన లవుడి మూడో తరానికి చెందినవాళ్లం .మా గోత్రం బద్ గుర్జర్ . ఈ గోత్రంవారే ఆల్వార్ఠికానా (రాజ్యం)ని పాలించినట్లు గా వాల్మీకిరామాయణంలో ఉంది. కోసల రాజ్యం(అయోధ్య) ఉత్తర ప్రాంతానికి లవుడు,దక్షిణానికి కుశుడు తమ పాలననువిస్తరించుకున్నారు. కుశుడు పాలించినప్రాంతమే ప్రస్తు త చత్తీస్ గఢ్ . ఈ వివరాలన్నీరామాయణంలోని 1,671వ పేజీలో ఉన్నాయి.‑ సత్యేంద్ర రాఘవ్ ,రాజస్థా న్ పీసీసీ అధికార ప్రతినిధి

రఘువంశానికి చెందినవాడినే.

మా కుటుంబం శ్రీరాముడి వంశావళికిచెందినదే అనడానికి చారిత్ర కఆధారాలున్నాయి. అయితే, నేను అయోధ్యభూమిపై ఎలాంటి హక్కును కోరను. రామజన్మభూమిలో రామ మందిరం కడితే చాలు.‑ అరవిం ద్ సింగ్ మేవాడ్ ,ఉదయ్ పూర్ రాజవంశీయుడు

 

మేము సూర్యవంశ రాజపుత్రులం. రాముడి కొడుకైనకుశుడి వారసులం. దీనిలో మరో ఆలోచన అక్కర్లేదు.రాముడి వంశీయులు ప్రపంచమంతా ఉన్నారు.రాజావత్ , షెకావత్ , కచ్వా వంశీయులందరూరాముడి వారసులే. సూర్యవంశ రాజపుత్రులనుకచ్వాలుగా వ్యవహరిస్తారు.‑ ప్రతాప్ సింగ్ కచరియావస్ , రాజస్థా న్ రవాణా మంత్రి

ఈ ప్రాంతం సీతారాముల రెండో కొడుకైన లవుడిఏలుబడిలోనిది. దియాకుమారి కుశ్వాహ(కచ్వా) వంశీయురాలే. కాదనం. అయితేఇక్కడ హక్కులన్నీ లవుడికి చెందినసిసోడియాలది. దీనికి సంబంధించి మా దగ్గరగట్టి ఆధారాలున్నాయి.‑ లోకేం ద్ర సింగ్ కల్వి, రాజపుత్ కర్ని సేన

సుప్రీం అడిగిందేమిటంటే…

ఒక భూమి వివాదాన్ని పరిష్కరించాలంటే అందుకు సంబంధించిన వారసుల గురించి ఆరా తీయడం కోర్టువారికి సహజం. అదే తీరులో రామ జన్మభూమిపై కేసు విచారణలో.. ‘రాముడి వారసులు ఎవరైనా ఉన్నారా? అయోధ్య రాముడి జన్మస్థలమేనని నమ్ముతున్న రఘు వంశీయులు ఇప్పటికీ ఉన్నారా?’ అని ప్రశ్నించిం ది. అయోధ్య కేసు విచారణను డే టు డే ప్రాతిపదికన విచారిస్తున్న అయిదుగురు జడ్జీల ధర్మాసం వేసిన ప్రశ్న ఇది. ఈ నెల 9వ తేదీన రామ్ లల్లా విరాజ్ మాన్ తరఫున సీనియర్ అడ్వకేట్ కె.పరాశరన్ హాజరయ్యా రు. రాముడు పుట్టిన ప్రదేశం గురించి వాల్మీకి రామాయణంలో ఉంది.. శ్రీరాముడు అయోధ్యలో జన్మించారన్నది భక్తుల విశ్వాసం’ అని వాదించారు. దీనిపై చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్ , జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ .ఏ.నజీర్, జస్టిస్ ఎస్.ఏ.బాబ్డే, జస్టిస్ డి.వై.చంద్రచూడ్ లతో కూడిన బెంచ్ ఆరాతీసింది. ‘ఈ విషయాన్ని క్లెయిమ్ చేయడానికి రఘు వంశీయులున్నారా?’ అని ప్రశ్నించింది.