వికారాబాద్, వెలుగు: మోస్తరు వానలకే వికారాబాద్ జిల్లా నవాబుపేట మండల కేంద్రంలోని సర్కారు దవాఖాన ఉరుస్తోంది. అధికారులు బయట రంగులతో మెరుగులు దిద్దారే తప్ప లోపల పట్టించుకోలేదు.
ఆదివారం రాత్రి కురిసిన వానకు శ్లాబ్, గోడలు ఉరిశాయి. ఆ నీరంతా ఫ్లోర్‌పై చేరడంతో సిబ్బంది చెత్త బుట్టలు, బకెట్లు పెట్టి ఎత్తిపోశారు. గోనె సంచులు పరిచారు. బిల్డింగ్అంతా పెచ్చులూడి కనిపిస్తోంది. వాటర్ ట్యాంక్ పాకురు చెత్తతో నిండిపోయింది.