వీటిని కూడా వదల్లేదా : డార్క్ వెబ్ లో BSNL ల్యాండ్ లైన్ కస్టమర్ల డేటా

వీటిని కూడా వదల్లేదా : డార్క్ వెబ్ లో BSNL ల్యాండ్ లైన్ కస్టమర్ల డేటా

డార్క్ వెబ్ ఇప్పటికే చాలా సంస్థల డేటాను దొంగిలించి వార్తల్లో నిలిచింది. తాజాగా టెలికాం ఆపరేటర్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ BSNL కూడా డేటా ఉల్లంఘనకు గురైనట్టు సమాచారం. పలు నివేదికల ప్రకారం, వేలాది మంది BSNL ఇంటర్నెట్, ల్యాండ్‌లైన్ యూజర్ల దొంగిలించబడిన డేటాను హ్యాకర్లు డార్క్ వెబ్‌లో విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రత్యేకంగా BSNL నుంచి ఫైబర్, ల్యాండ్‌లైన్ కనెక్షన్‌లను ఉపయోగిస్తున్న వారి గురించి క్లిష్టమైన సమాచారాన్ని పొందినట్లు వార్తలు వస్తున్నారు. పెరెల్ అనే మారుపేరుతో పనిచేస్తున్న ఈ హ్యాకర్ డార్క్ వెబ్‌లో దొంగిలించబడిన డేటాలో కొంత భాగాన్ని బహిర్గతం చేశాడు. డేటాసెట్‌లో మెయిల్ చిరునామాలు, బిల్లింగ్ సమాచారం, సంప్రదింపు నంబర్‌లు, BSNL ఫైబర్, ల్యాండ్‌లైన్ వినియోగదారులకు లింక్ చేయబడిన ఇతర ప్రైవేట్ డేటా వంటి సున్నితమైన వివరాలు ఉన్నాయి. వీటితో పాటు మొబైల్ సర్వీస్ అవుట్‌టేజ్ రికార్డ్‌లు, పూర్తయిన ఆర్డర్‌లు, కస్టమర్ సమాచారం వంటి మరింత క్లిష్టమైన సమాచారం కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

ఓ నివేదిక ప్రకారం, హ్యాకర్ షేర్ చేసిన డేటాసెట్‌లో దాదాపు 32వేల లైన్ల డేటా ఉంది. ఈ 'పెరెల్' అనే హ్యాకర్ అన్ని డేటాబేస్‌లలో సుమారుగా 2.9 మిలియన్ లైన్ల డేటాను కలిగి ఉన్నారని పేర్కొన్నారు. ఇందులో BSNL కస్టమర్ ల జిల్లాల వంటి సమాచారం కూడా ఉంది.

ఈ ఉల్లంఘనకు సంబంధించి BSNL నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ, ఈ హ్యాకింగ్ సంఘటన గురించి భారతీయ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సెర్ట్-ఇన్‌కు సమాచారం అందించినట్టు తెలుస్తోంది. ఈ ఉల్లంఘనపై సైబర్ సెక్యూరిటీ నిపుణుడు, ఇండియా ఫ్యూచర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కనిష్క్ గౌర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది కస్టమర్ల ప్రైవసీని దెబ్బతీయడమే కాకుండా ఐడెంటినీదొంగతనం చేయడం, ఆర్థిక మోసం, ఫిషింగ్ ప్రయత్నాల వంటి ప్రమాదాలకు గురి చేస్తుందని పేర్కొన్నారు..